హైదరాబాద్: 28°C
తెలంగాణ

BJP మహిళా మోర్చా అధ్యక్షురాలికి అభినందనలు

SRCL: తంగళ్లపల్లి మండల బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా చింతల్తాన సర్పంచ్ గుర్రం అనసూయ నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రెడ్డబోయిన గోపిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.