హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు గుర్తింపు సంఖ్య తప్పనిసరి: AEO

SRD: ​ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు పొందేందుకు రైతులకు విశిష్ట రైతు గుర్తింపు సంఖ్య తప్పనిసరి అని కంగ్టి AEO శ్వేత తెలిపారు. ఇవాళ మండలంలోని స్థానిక రైతులతో సమావేశమై ఫార్మర్ ఐడీ ప్రాముఖ్యతను వివరించారు. రైతుల ఆధార్, పట్టాదార్ పాస్‌బుక్, బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ప్రతి ఒక్కరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.