హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

MHBD: మరిపెడ మండలం గురప్పతండాలో విద్యుత్ షాక్‌కు గురై యువకుడు బానోతు మహేందర్ శనివారం మృతి చెందాడు. వ్యవసాయ భూమి వద్ద బావి మోటార్‌కు విద్యుత్ సరఫరా సరిగా రాకపోవడంతో సర్వీస్ వైరు రిపేర్ చేస్తుండగా షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు తండావాసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మహేందర్ మృతితో గురప్పతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.