హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్లవ్వ కుటుంబానికి ఆర్థిక సాయం

రామాయంపేట మండలం సుతారిపల్లి గ్రామానికి చెందిన అక్కల మల్లవ్వ హఠాన్మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు, మెదక్ నియోజకవర్గ ఇన్‌‌ఛార్జి కంటారెడ్డి తిరుపతిరెడ్డి సంతాపం తెలిపారు. కార్యకర్తల ద్వారా మృతురాలి కుటుంబానికి రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.