హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాల నూతన భవనానికి రూ.13.50 లక్షల నిధులు

NRPT: మరికల్ మండలం పూసల్‌పహాడ్ గ్రామంలోని పాఠశాల నూతన భవన నిర్మాణానికి నాబార్డ్ నిధుల నుంచి రూ.13.50 లక్షలు మంజూరైనట్లు జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు సూర్యమోహన్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.