హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాచారెడ్డిలో ఇందిరమ్మ ఇళ్లకు మార్క్‌ఔట్‌

KMR: మాచారెడ్డిలో నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇంటి నిర్మాణ స్థలాల్లో మార్క్‌ఔట్‌ నిర్వహించారు. సర్పంచ్‌ పాతూరి సంతోష్‌రెడ్డి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు లబ్ధిదారుల స్థలాలను పరిశీలించి ఇంటి నిర్మాణానికి అవసరమైన కొలతలు వేశారు. లబ్ధిదారులు నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించి ఇళ్లను పూర్తి చేసుకోవాలని సర్పంచ్‌ సూచించారు.