హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ మృతి

NZB: ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి శివారులో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 3 గంటల సమయంలో లారీ, డీసీఎం ఢీకొన్నాయి. ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడు రాజస్థాన్కు చెందినవాడని పేర్కొన్నారు. క్లీనర్ను ఆస్పత్రికి తరలించారు.