మెదక్ జిల్లా రామాయంపేట సబ్ స్టేషన్ వద్ద రైతులు రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. రోజుకు 12 గంటల కరెంటు ఇస్తామని చెప్పి 4 గంటలు కూడా ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరు అందక పొలాలు బీటలు వారుతున్నాయని, తీవ్ర నష్టం వాటిల్లుతోందని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయాలని కోరారు.
తెలంగాణ
VIDEO: కరెంటు కోతలపై రైతుల రాస్తారోకో


