హైదరాబాద్: 28°C
తెలంగాణ

సొంతింటి సంతోషం క్షణకాలమే.!

SDPT: అప్పుల బాధ తట్టకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిద్దిపేటకు చెందిన ట్రాలీ ఆటో డ్రైవర్‌ ముక్కెర నర్సింహులు(39) ఇంటి నిర్మాణానికి చేసిన అప్పును తీర్చలేక, ఆర్థిక ఒత్తిడితో సతమతమయ్యాడు. ఈ విషయంపై గురువారం రాత్రి భార్యతో గొడవ జరగడంతో మనస్తాపం చెంది అర్ధరాత్రి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.