హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెళ్లి కావడం లేదని యువకుడి సూసైడ్

KMM: కూసుమంచి మండలం జీళ్లచెరువులో విషాద ఘటన చోటుచేసుకుంది. వివాహ సంబంధాలు కుదరక మనస్తాపానికి గురైన భీష్మ అనే యువకుడు శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు కొంతకాలంగా వివాహం కోసం సంబంధాలు చూస్తున్నా ఏదీ ఖరారు కాకపోవడంతో ఈనిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.