హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తుని సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సదాశివనగర్‌ మండలం రాజమణి గ్రామానికి చెందిన మహిళ మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. దైవసేవ కోసం అన్నవరం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆమె మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.