RR: చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో కుటుంబ వేధింపులతో వివాహిత రాధిక(24) అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ముడిమ్యాల గ్రామానికి చెందిన రాధికకు ఐదేళ్ల క్రితం మధుతో వివాహమైంది. శుక్రవారం చెట్టుకు ఉరేసుకుని మృతి చెందింది. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధించారని తల్లిదండ్రులు ఆరోపించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
కుటుంబ వేధింపులతో వివాహిత ఆత్మహత్య


