హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు 50ఏళ్లు!

హైదరాబాద్‌ను న్యూఢీల్లీతో అనుసంధానిస్తూ, లక్షలాది మంది ప్రయాణికులకు సేవలందిస్తున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలు 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1976 అక్టోబరు 3న ప్రారంభమైన ఈరైలు, నేటితో అర్ధ శతాబ్దాన్ని పూర్తి చేసుకుంది. 'బ్లూ బుల్లెట్'గా పేరుగాంచిన ఈరైలు, దక్షిణ మధ్య రైల్వేకు ఎంతో గర్వకారణంగా నిలిచింది.