హైదరాబాద్: 28°C
తెలంగాణ

హుజురాబాద్ సబ్‌జైలులో సంక్షేమ దినోత్సవం

KNR: గాంధీ జయంతి సందర్భంగా హుజురాబాద్ సబ్‌జైలులో శుక్రవారం ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయమూర్తి కిరణ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఖైదీలను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం క్రీడల్లో ప్రతిభ కనబరిచిన ఖైదీలకు బహుమతులు అందజేశారు. సబ్‌జైలు ఇన్‌చార్జ్, అసిస్టెంట్ డిప్యూటీ జైలర్ సురేశ్, సిబ్బంది పాల్గొన్నారు.