హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీట మునగని గణేషులు

BDK: భద్రాచలంలోని గోదావరిలో నిమజ్జనం చేసిన గణపయ్యాల పరిస్థితి వేరుగా ఉంది. నదిలో లోపలకు కాకుండా కేవలం కొద్ది లోతులోనే విగ్రహాలను వదిలారు. అవి ఒడ్డుకు చేరి బురదలో కూరుకుపోయి కనిపిస్తున్నాయి. భక్తులు అయ్యో వినాయక ఎంతటి అపచారం అంటూ మనో వేదనకు గురవుతున్నారు. దీనిపై భక్తులు పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. మట్టి విగ్రహాలు పూజిస్తే ఇలాంటి పరిస్థితి రాదని, ప్రకృతి ప్రేమికులు అంటున్నారు.