హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామసభపై MPDOకు ఫిర్యాదు

WGL: నల్లబెల్లి(M)నారక్కపేటలో గాంధీ జయంతి గ్రామసభకు ముందస్తు చాటింపు, నోటీసులు ఇవ్వకుండానే నిర్వహించినట్లు రికార్డుల్లో చూపుతున్నారని మాజీ ఉప సర్పంచ్ వడ్లూరి రమేష్ MPDOకు ఫిర్యాదు చేశారు. ప్రజలకు సమాచారం ఇవ్వకుండా గ్రామసభ నిర్వహించిన సర్పంచ్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామంలో కొందరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నరని పేర్కొన్నారు.