వీరాసనం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. తొడలు, మోకాళ్లు, చీలమండలాలను సాగదీసి, కాళ్లలోని అలసటను తగ్గిస్తుంది. ఉదర భాగంలోని అవయవాలను ఉత్తేజపరిచి, అజీర్తి, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. వెన్నుముకను బలపరుస్తూ, సరైన శరీర భంగిమను అలవాటు చేస్తుంది. కాళ్లు, పాదాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గించి, ధ్యానం చేయడానికి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.
ఆరోగ్యం
వీరాసనం వల్ల కలిగే ఉపయోగాలు


