అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం (M) ఎర్రవరంకు చెందిన యువతి పలివెల సాహితీ జాతీయ క్రీడా వేదికపై సత్తా చాటింది. ఉత్తరాఖండ్ వేదికగా నిర్వహించిన జాతీయ ఫెన్సింగ్ పోటీల అండర్-17 విభాగంలో ఆమె రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం నెల్లూరులోని అక్షర విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరం అభ్యసిస్తున్న సాహితీ.. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ స్పూర్తిగా నిలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
జాతీయ వేదికపై సత్తా చాటిన ఎర్రవరం తేజం


