SRCL: ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది ప్రధాన రోడ్డు నుంచి గణేశ్‌నగర్ ప్రాథమిక పాఠశాల వరకు వేసిన సీసీ రోడ్డు అంచులు ఇటీవల కురిసిన వర్షాలకు కోతకు గురయ్యాయి. ముఖ్యంగా మలుపుల వద్ద రోడ్డు అంచులు దెబ్బతినడంతో వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. అధికారులు వెంటనే స్పందించి మట్టి పోసి రోడ్డు అంచులను పటిష్ఠం చేయాలని గ్రామాల వాహనదారులు కోరుతున్నారు.
తెలంగాణ
మలుపుల వద్ద ప్రమాదకరంగా మారిన సీసీ రోడ్డు


