MLG: పంటను జంతువుల నుంచి రక్షించేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగలడంతో రైతు మృతి చెందిన ఘటన ములుగు మండలం జాకారం గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన సాహి మహమ్మద్ (62) తన పొలం వద్దకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. సీఐ దారం సురేష్ ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
తెలంగాణ
విద్యుదాఘాతంతో రైతు మృతి


