PDPL: కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో ప్రయాణికుల సౌకర్యార్థం 1996లో రూ.16 లక్షలతో నిర్మించిన బస్టాండ్ నిరుపయోగంగా మారింది. రహదారికి దూరంగా ఉండటంతో బస్సులు అక్కడికి వెళ్లడం లేదు. ప్రధాన రహదారిపైనే బస్సులు ఆపడంతో ప్రయాణికులు ఎండా వానలో ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని ప్రయాణికులు వాపోతున్నారు.
తెలంగాణ
నిరుపయోగంగా రూ.16 లక్షలతో నిర్మించిన బస్టాండ్


