కృష్ణా: బాపులపాడు (M) వేలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం మరో అవకాశం లభించింది. ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తు గడువును ఈ నెల 15వ వరకు పొడిగించినట్లు విద్యాలయ ప్రిన్సిపల్ రాజశేఖర్ తెలిపారు. 8, 10వ తరగతుల విద్యార్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నవోదయలో ప్రవేశాలకు గడువు పొడిగింపు


