హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీడీఎస్ బియ్యం పట్టివేత

SRPT: అనంతగిరి మండల పరిధిలోని శాంతినగర్ గ్రామ శివారులోని ఓ కోళ్లఫామ్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన 50 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. సమాచారం మేరకు తనిఖీ చేయగా సుమారు 15 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఏడుకొండలు తెలిపారు.