హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

PDPL: అంతర్గాం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూజేఐ) ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాధాస్వామిగౌడ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఎమ్మెల్యేను సత్కరించి, ఇళ్ల స్థలాలు, ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతిపత్రం అందజేశారు.