హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఇంధన విక్రయాలపై పరిమితులు వద్దు: కేంద్రం

పెట్రోలు లేదా డీజిల్ విక్రయాలపై పరిమితులు పెట్టొద్దని ప్రైవేటు ఇంధన రిటెయిల్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు చమురు కార్యదర్శి నీరజ్ మిత్తల్ వెల్లడించారు. ఇంధన విక్రయాలపై పరిమితికి ఎవరినీ అనుమతించమని, అది ఆమోదయోగ్యం కాదని నీరజ్ పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిలో మార్పులేదని స్పష్టం చేశారు.