హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవోదయ విద్యాలయంలో ఆరోగ్య శిబిరం

KMR: నవోదయ విద్యాలయంలో విద్యార్థులకు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. సాధారణంగా వచ్చే చర్మ వ్యాధులు, వాటి నివారణ చర్యలపై డాక్టర్‌ సౌజన్య అవగాహన కల్పించారు.చర్మంపై దురద, దద్దుర్లు, మచ్చలు,పొక్కులు వంటి సమస్యలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా అనేక చర్మ సమస్యలకు దూరంగా ఉండవచ్చని తెలిపారు.