KMR: గాంధారి గ్రామ దేవత శ్రీ గంగమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ పనులు గ్రామ ప్రజల సహకారంతో కొనసాగుతున్నాయి. గర్భగుడి పునాది,పిల్లర్ల నిర్మాణం పూర్తి చేసి స్లాబ్ పనులు చేపట్టారు.అనంతరం గోపుర నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.ఈ సందర్భంగా కొండే శ్రవణ్ ₹5,101, కొండే సాయి ₹11,116 విరాళాలు అందించారు. విరాళాలు అందించిన వారికి కమిటీ, గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
గంగమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణానికి విరాళాలు


