WNP: పానగల్ మండలంలో రేపు రాష్ట్ర ఎక్సైజ్ అండ్ పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేష్ నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని పలు గ్రామాలకు మంజురైన గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడి భవనాలకు బహుమతి పూజ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ
రేపు పానగల్ మండలంలో మంత్రి పర్యటన


