హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్వాడీ కేంద్రంలో అగ్నిప్రమాదం

RR: అత్తాపూర్ డివిజన్ పరిధిలోని ఎర్రబొడ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న సీడీపీఓ కవిత, సూపర్‌వైజర్ శారద కేంద్రాని సందర్శించి వివరాలు సేకరించారు. ప్రమాదంలో తూకపు యంత్రాలు, ఆట వస్తువులు, పాత రిజిస్టర్లు, 90 గుడ్లు, 50 కేజీల బియ్యం దెబ్బతిన్నాయి. నష్టంపై జిల్లా మహిళా, శిశు సంక్షేమాధికారికి నివేదిక ఇచ్చారు.