హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాంపూర్ గ్రామంలో గంజాయి సాగు.. ఒకరు అరెస్ట్

ADB: గాదిగూడ మండలం ఖండో రాంపూర్ గ్రామంలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ అంజమ్మ, ఎస్ఐ రమ్య వివరాల ప్రకారం.. సమాచారం అందడంతో గ్రామ శివారులో పోలీసులు తనిఖీ చేశారు. పత్తి, కంది పంటల మధ్య అంతరపంటగా సాగు చేస్తున్న గేడం రాజేశ్వర్‌ను అరెస్ట్ చేసి.. 24 గంజాయి మొక్కలను స్వాధినం చేసుకున్నారు.