హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇల్లంద సర్పంచ్‌కు షోకాజ్ నోటీసులు

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామపంచాయతీలో రూ.13 లక్షల నిధుల వినియోగంపై అధికారులు తనిఖీలు నిర్వహించారు. సరైన తీర్మానాలు, ఎంబీ రికార్డులు, అంచనాలు లేకుండా నిధులు డ్రా చేసినట్లు గుర్తించిన అధికారులు సర్పంచ్, ఉపసర్పంచ్, కార్యదర్శికి శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారి కల్పన ఆదేశించారు.