హైదరాబాద్: 28°C
తెలంగాణ

సూర్యాపేట సబ్‌జైలులో న్యాయ అవగాహన

SRPT : ఎవరూ పుట్టుకతో నేరస్తులు కారని, చెడు అలవాట్లు, తప్పుడు నిర్ణయాల వల్లే జైలు జీవితం గడపాల్సి వస్తుందని ఫస్ట్ అడిషనల్ జిల్లా జడ్జి డా. పి. శివరామ్ ప్రసాద్ అన్నారు. గాంధీ జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఖైదీలు సన్మార్గంలో పయనించి మంచి పౌరులుగా సమాజంలో జీవించాలని, ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.