హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా ప్రజలకు ఎస్పీ నరసింహ హెచ్చరిక

SRPT: శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం జిల్లావ్యాప్తంగా ఈ నెల 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. డీజేలు, సౌండ్ సిస్టమ్‌ల వినియోగంపై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.