SRPT: పట్టణానికి చెందిన ప్రముఖ పత్రికా ఫోటోగ్రాఫర్ మడూరి బ్రహ్మచారి జాతీయ ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డును అందుకున్నారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వికాస్ ప్రాంగణంలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో భాగంగా ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ప్రతిష్టాత్మక అవార్డు సాధించిన బ్రహ్మచారిని సూర్యాపేట జిల్లా పత్రికా ఫోటోగ్రాఫర్లు, ప్రముఖులు అభినందించారు.
తెలంగాణ
జాతీయ ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు బ్రహ్మచారి


