SRPT: జిల్లాలో పోలీసు ఉద్యోగాల ఆశావహుల కోసం 45 రోజుల ఉచిత శిక్షణకు ఆదివారం ఎంపిక పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ ఈరోజు తెలిపారు. జిల్లాలో నాలుగు కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుందన్నారు. స్క్రీనింగ్ టెస్ట్‌లో ప్రతిభ చూపిన 400 మందికి శిక్షణ ఇస్తామని పేర్కొంటూ, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
తెలంగాణ
పోలీసు ఉద్యోగ ఉచిత శిక్షణకు ఆదివారం ఎంపిక పరీక్ష


