హైదరాబాద్: 28°C
తెలంగాణ

సబ్సిడీతో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోండి: ఎస్ఈ

GDWL: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 'పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ' పథకాన్ని వినియోగించుకుని సబ్సిడీతో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని విద్యుత్ శాఖ ఎస్ఈ అబ్దుల్ కరీం సూచించారు. గద్వాల డివిజన్ కార్యాలయంలో శుక్రవారం ఆయన 'సేవా సేతు అభియాన్' శిబిరాన్ని ప్రారంభించారు. ఈ పథకం పూర్తి వివరాల కోసం వినియోగదారులు 040-48526869 హెల్ప్‌డెస్క్ నంబరును సంప్రదించాలన్నారు.