హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామప్ప ఆలయాన్ని సందర్శించిన ఇస్రో శాస్త్రవేత్త దంపతులు

MLG: వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని ఇస్రో అడిషనల్ సెక్రటరీ, శాస్త్రవేత్త సుశీల్ కుమార్ శ్రీవాత్సవ దంపతులు శుక్రవారం సందర్శించారు. అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ ఆలయ చరిత్ర, శిల్పకళా వైభవాన్ని వివరించారు. అనంతరం రామప్ప చెరువులో బోటింగ్ చేశారు.