హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేయాలి'

RR: ఫరూఖ్ నగర్ మండలం వెలిజర్ల గ్రామంలో ప్రత్యేక గ్రామసభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బాబు నాయక్ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధితో పాటు పారిశుధ్యం, ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామంలో నెలకొన్న ప్రతి సమస్యను గ్రామసభ దృష్టికి తీసుకురావాలని తద్వారా ప్రతి సమస్యను పరిష్కరించుకోవచ్చు అన్నారు.