హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనుమతి లేకుండా మద్యం విక్రయం.. ముగ్గురిపై కేసు

WGL: వరంగల్ అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తున్న ముగ్గురిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం మిల్స్‌ కాలనీ, మట్టేవాడ, కాజీపేట పోలీస్‌స్టేషన్‌ పరిధుల్లో దాడులు నిర్వహించి మొత్తం రూ.43,450 విలువైన మద్యం, బీరు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కందగట్ల హరిత, వనమాల సునీత,సురేందర్‌గౌడ్‌లను కేసు నమోదు నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించారు.