హైదరాబాద్: 28°C
తెలంగాణ

చాగదోనలో సీసీ కెమెరాల ఏర్పాటు

GDWL: గ్రామ ప్రజలు, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గట్టు మాజీ ఎంపీపీ జె. విజయ్ కుమార్ సొంత నిధులు రూ.65 వేలతో చాగదోనలో ఆరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. హైస్కూల్, జీపీ కార్యాలయం సహా కీలక ప్రాంతాల్లో వీటిని అమర్చారు. శుక్రవారం అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఎస్సై శేఖర్ గౌడ్, సర్పంచ్ కెమెరాలను ప్రారంభించారు. నేరాల నియంత్రణకు ఇవి దోహదపడతాయని తెలిపారు.