SDPT: అక్కన్నపేట మండలం పెద్దతండాకు చెందిన గుగులోతు తిరుపతి నాయక్‌ను బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధిగా నియమించారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తనకు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తూ గిరిజనుల హక్కుల పరిరక్షణ, తండాల అభివృద్ధికి కృషి చేస్తానని తిరుపతి తెలిపారు.
తెలంగాణ
గిరిజన మోర్చా అధికార ప్రతినిధిగా తిరుపతి


