హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండు డీఏలు విడుదల పట్ల టీఎన్జీవోస్ హర్షం

MNCL: ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు విడుదల చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేయడం పట్ల టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ 51 శాతం ఫిట్మెంట్‌తో అమలు చేయాలని అన్నారు. మిగిలిన పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు.