KMM: కూసుమంచి మండలం రాజుపేట గ్రామంలో బెల్ట్ షాపులను పూర్తిగా మూసివేయాలని గ్రామసభలో గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. నిత్యం మద్యం అందుబాటులో ఉండటం వల్ల యువత మద్యానికి బానిసలై ఆరోగ్యాలు పాడుచేసుకుంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాన్ని రక్షించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంటూ గ్రామస్తులంతా కలిసి ప్రతిజ్ఞ చేశారు.
తెలంగాణ
గ్రామసభలో కీలక తీర్మానం..!


