హైదరాబాద్: 28°C
తెలంగాణ

13వ సారి రక్తదానం చేసిన కడకుంట్ల జగదీశ్వర్

JGL: రాయికల్ పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు కడకుంట్ల జగదీశ్వర్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. కథలాపూర్ మండలం ఊట్పల్లి గ్రామానికి చెందిన తొగరి రాధ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు అత్యవసరంగా 'బి పాజిటివ్' రక్తం అవసరమని తెలుసుకున్న జగదీశ్వర్, వెంటనే ఆసుపత్రికి చేరుకుని రక్తదానం చేశారు. ఆయన రక్తదానం చేయడం ఇది 13వ సారి కావడం విశేషం.