హైదరాబాద్: 28°C
తెలంగాణ

మేడపల్లిలో కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభం.

WGL: ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు మేడపల్లిలో నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్నినల్లబెల్లి మండల అధ్యక్షుడు మాలోత్ చరణ్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. త్వరలో మహిళలకు కుట్టు మిషన్లు, యువతకు రుణాలు, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్నారు.