హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోహిణి ఆస్పత్రి నుంచి హైదరాబాద్‌కు ఎస్సై తరలింపు

HNK: ధర్మసాగర్‌ మండలం టేకులగూడెం ఓఆర్‌ఆర్‌ వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వేలేరు ఎస్సై అజ్మీర సురేష్‌ గాయపడ్డారు. ప్రమాదంలో ఆయన ఎడమ కాలుతో పాటు శరీరంలోని పలు చోట్ల గాయాలయ్యాయి. వెంటనే హనుమకొండలోని సుబేదారి రోహిణి ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం శుక్రవారం కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌కు తరలించారు.