హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాంధీ పార్కు అభివృద్ధికి శంకుస్థాపన

MHBD: జిల్లా 33వ వార్డులోని గాంధీ పార్కు అభివృద్ధికి ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ రూ. 40 లక్షల నిధులతో నేడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పార్కులో మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. విగ్రహాన్ని ప్రధాన రహదారి వద్ద ఏర్పాటు చేయాలని సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్,అజయ్ సారధి రెడ్డి సూచించగా ఎమ్మెల్యే అంగీకరించారు.