హైదరాబాద్: 28°C
తెలంగాణ

జర్నలిస్టుల డిమాండ్ల దినంగా గాంధీ జయంతి

BHPL: భూపాలపల్లి పట్టణంలో ఐజేయూ, టీయూడబ్ల్యూజే పిలుపు మేరకు శుక్రవారం గాంధీ జయంతిని జర్నలిస్టుల డిమాండ్ల దినంగా పాటించారు. గాంధీ విగ్రహానికి యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు క్యాతం సతీష్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి సమంతుల శ్యామ్‌ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నివాళులర్పించారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే, కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.