హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా నాటికి అమ్మవారి రథం ప్రారంభం

HNK: దసరా పర్వదినం నాటికి భద్రకాళి అమ్మవారి రథాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. భద్రకాళి ఆలయ పరిసరాల్లో కొనసాగుతున్న మాడవీధుల నిర్మాణ పనులను నేడు వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు సూచనలను చేశారు.