హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆర్చర్ల అద్భుత ప్రతిభ.. భారత్‌కు మరో రజతం

2026 ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్లు అద్భుత ప్రతిభ కనబరిచారు. దీంతో పురుషుల రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు రజత పతకం వరించింది. ధీరజ్ బొమ్మదేవర, నీరజ్ చౌహాన్, యశ్‌దీప్ భోగేలతో కూడిన భారత త్రయం అద్వితీయ ఆటతీరుతో దేశానికి సిల్వర్ మెడల్ అందించింది. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో మన జట్టు మరో పతకం సాధించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.